![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -493 లో...... సుమిత్ర స్పృహలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానేంటని వెళ్లిపోతుంటే.. శౌర్య వచ్చి ఆపుతుంది. అమ్మమ్మ మీరు ఇక్కడే ఉండాలని అంటుంది. లేదు వెళ్ళాలని తను అంటుంది. అప్పుడే దీప వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండాలని దీప అంటుంది. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్లాలని దీప అంటుంది. అలా అయితే నా చావుతో సమానమని చెప్పాను.. అయిన సరే తీసుకొని వచ్చావ్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటని సుమిత్ర అడుగుతుంది.
అప్పుడే కాంచన వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పలేదు అమ్మ అని దీప అంటుంది. నేను నమ్మనని సుమిత్ర అనగానే నిజం వదిన చెప్పలేదని కాంచన అంటుంది. నా కోసం నువ్వు ఎందుకు వెతకాలి అంటే ఒక మాట అన్నావ్ గుర్తు ఉందా అని సుమిత్ర అడుగుతుంది. అవును అన్నానని దీప అంటుంది. నువ్వు నా అమ్మవి అందుకే వెతుకుతున్నానని అంది. అలా ఎందుకు అన్నవని సుమిత్ర అడుగుతుంది. ఎందుకు అంటే మిమ్మల్ని నేను ఆలా ఫీల్ అవుతున్నానని దీప అంటుంది.
మరొకవైపు సుమిత్ర గురించి దశరథ్ నిద్ర నుండి ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేస్తాడు. ఇంట్లో అందరు వస్తారు. మీరేం కంగారు పడకండి మావయ్య అత్త క్షేమంగా ఉందని కార్తీక్ చెప్తాడు. ఏ దైర్యం తో ఉండమంటావ్ రా అని శివన్నారాయణ అడుగుతాడు. నా మీద నమ్మకం ఉంచండి అని కార్తీక్ అంటాడు. మరొకవైపు సుమిత్ర కోసం దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. వద్దని అంటుంది. నేనే చేసాను వదిన అని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |